రష్యన్‌ విప్లవ చరిత్ర
 
వర్తమానంలో ఏదైనా సాధించాలంటే గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కట్టుకథలు, అర్థ సత్యాలతో నిండిన అకడమిక్‌ పుస్తకాల నుంచి సమగ్రమైన, సరైన చరిత్రను ఆశించలేం. ఆ లోటును తీరుస్తుంది విరసం ప్రచురించిన బోల్షివిక్‌ పార్టీ చరిత్ర. 1953లో తొలిసారి ప్రచురించిన ఈ చరిత్రను రష్యన్‌ విప్లవానికి వందేళ్ల సందర్భంగా పునర్ముద్రించారు. సాధారణంగా ఇలాంటి చరిత్రలో వివరణకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంతేగాక, ఎంతో కొంత ఒంటెద్దు పోకడతో సాగుతాయి. ఇలాంటి పోకడలకు విరుద్ధంగా విప్లవోద్యమ పంథాలోని ఎగుడుదిగుడలను కూడా అక్షరబద్ధం చేశారు. వివిధ దశల్లో సాగిన రష్యన్‌ విప్లవం తీరుతెన్నులను పన్నెండు అధ్యాయాల్లో సువివరంగా విశదీకరించారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న శ్రామిక జనావళిలో ఎన్నో ఆశలు రేకెత్తించి, ఎన్నో నూతన మార్పులకు దోహదం చేసిన రష్యన్‌ విప్లవం గురించి తెలుసుకోవాలనుకున్న వారంతా తప్పక చదవవాల్సిన పుస్తకం ఇది.                                               
- దేరా
బోల్షివిక్‌ పార్టీ చరిత్ర
పేజీలు: 519, వెల : రూ.250 
ప్రతులకు : 9989189250 
 ప్రముఖ పుస్తక కేంద్రాలు