వర్షంలో వేడి వేడి కాఫీ తాగించేవాడు మామూలు రచయితై ఉండొచ్చుగానీ, ఆ టైములో పాఠకులతో ఐస్‌క్రీం తినిపించి ఆహా! ఓహో! అనిపించే వాడే డిఫరెంట్‌ రచయిత! అలాంటి క్వాలిటీ ఉన్న ఎన్నారై హాస్య రచయిత డాక్టర్‌ కె.వివేకానందమూర్తి.  తణుకులో పుట్టి యూరప్‌లో మెట్టి న డాక్టర్‌ మూర్తి తొలుత మిమిక్రీ ఆర్టిస్టు, రంగస్థల సినీ నటుడు మాత్రమేకాదు, జ్యోతిచిత్ర వీక్లీ తొలి సంపాదకుడుగా కలం ఝుళిపించివాడు. పాతికేళ్ళుగా బ్రిటన్‌లో బిజీ డాక్టరుగా ఉన్నా, గడచిన మూడేళ్ళుగా అంతర్జాల పత్రిక ‘కౌముది’ లో నెలకో ‘సినీ బేతాళకథ’ చెబుతూ భిన్నమైన వ్యంగ్య హాస్యాలతో తెలుగువారిని కితకితలు పెడుతూ అలరిస్తున్నారు. వీటిల్లో 34 కథల్ని పుస్తకంగా తెచ్చారు ఎమెస్కోవారు. మనసు హాయిగా లేనప్పుడు, హాయిని కోరుకున్నప్పుడు ఈ పుస్తకం తెరిస్తే చాలు అదే మీచేత అలవోకగా చదివిస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది.

 

సినీ బేతాళ కథలు
డాక్టర్‌ కె. వివేకానందమూర్తి
ధర 125 రూపాయలు, పేజీలు 176
ప్రతులకు  ఎమెస్కో బుక్స్‌, చంద్రం బిల్డింగ్స్‌ , సి.ఆర్‌.రోడ్‌, చుట్టుగుంట, విజయవాడ –4
ఫోన్‌ 0866–2436643