విశ్వసాహితీ నవలాకారునిగా కీర్తిపొందిన ఫ్రెంచ్‌ రచయిత అలెగ్జాండర్‌ డ్యూమా రాసిన ‘కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో’ ను ఇంగ్లీషు నుంచి అనువదించారు అభ్యుదయవాది, జర్నలిస్టు, రచయిత కీ.శే. సూరంపూడి సీతారాం. నెపోలియన్‌ కాలపు ఈ ఫ్రాన్స్‌ రాజకీయ నేపథ్య నవల, తర్వాత ఎన్నో నవలలు, సినిమాలకిదే మాతృక. పగ, ప్రతీకారాల మాంట్‌ క్రిస్టో కథ. ఒక అమాయకుడైన నావికుడు కుట్రలవల్ల జైలుపాలై బయటకొచ్చి శత్రువులపై పగ తీర్చుకోవడమే ఈ నవలాంశం.

 

కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో
అలెగ్జాండర్‌ డ్యూమా
స్వేచ్ఛానువాదం సూరంపూడి సీతారాం 
ధర 400 రూపాయలు
పేజీలు 534
ప్రతులకు  పల్లవి పబ్లికేషన్స్‌, అశోక్‌నగర్‌, విజయవాడ–10సెల్‌ 9866115655