తెలుగు సాహితీ చరిత్రకు చుక్కాని శ్రీలేఖ సాహితి. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇప్పటివరకు శ్రీలేఖ సాహితి భిన్న ప్రక్రియల్లో 123 పుస్తకాలు ప్రచురించి ఉన్నతశిఖరాలధిరోహించింది. సుప్రసిద్ధ సాహితీవేత్త, నిరంతర కృషీవలుడు డా.టి.శ్రీరంగస్వామికే ఈ ఘనకీర్తి దక్కుతుంది. 2016లో ‘వరంగల్లు జిల్లా కథాసర్వస్వం’ ప్రచురించిన స్ఫూర్తితో, ఇప్పుడు మళ్ళీ 16 కథలతో ‘హనుమకొండ కథలు’ సంకలనం ప్రచురించింది. ఇందులో ఏడు కథలు రచయత్రులవే. మచ్చుకు చూస్తే, తొలి కథ ‘నయాచోర్‌’ శ్రమలేకుండా డబ్బు సంపాదించాలనుకునేవారికి ఎరవేసి దోచుకునే నయా చోర్‌ కథ ఇది.తెలంగాణ బతుకుచిత్రానికి దర్పణమీ కథలు.  

సంపాదకత్వం డా.టి.శ్రీరంగస్వామి

ధర 120 రూపాయలు
పేజీలు 144
ప్రతులకు శ్రీలేఖ సాహితి, మండల్‌ ఆఫీసు ఎదురుగా, హసనపర్తి, వరంగల్‌–506371 
సెల్‌ 99 48 57 955 నవచేతన బుక్‌హౌస్‌లు, నవోదయ, ఆర్యసమాజ్‌ ఎదురుగా, హైదరాబాద్‌