వయసుకు అతీతంగా అందరూ చదివేది ప్రేమ కథలే. ఆ కథల్లో మన గతం ఉంటుంది. అలౌకికమైన ఒక గొప్ప ఆనందం, సంతోషం, అనుభూతి, ఉద్వేగాలుంటాయి. వాటిని తల్చుకున్నా, అనుభవించినా, అనుభూతించినా కష్టాన్ని మరచిపోతాం. ప్రకృతి, ప్రేమ–నువ్వూ నేనూ...నువ్వు నేనుగా మారిపోయే ప్రేమ...ఆ ప్రేమను స్పర్శతో పలికించే తాదాత్మ్యత...ఆ సంతృప్తిని అనుభవించే నిద్ర...అదొక్కటే..ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఈ పుస్తకంలో ఉన్న పన్నెండు కథలూ చదివితే మనమో కొత్త ప్రపంచాన్ని చూస్తాం, పుస్తకాన్ని, టైటిల్‌ని చూడగానే ఆ పుస్తకంతో ప్రేమలో పడిపోతాం. 

ఇన్‌ ద మూడ్‌ ఫర్‌ లవ్‌

సంపాదకులు అపర్ణ తోట, వెంకట్‌ శిద్దారెడ్డి
ధర 200 రూపాయలు
పేజీలు 226
ప్రతులకు www.amazon.in, నవతరంగం చలనచిత్రం, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్‌,
హైదరాబాద్‌ ఫోన్లు 970 597 2222., 984 988 8773