కవి, కథకుడు, నవలారచయిత సలీం. ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు, తొమ్మిది కథాసంపుటాలు, మరో 18 నవలు రాశారు సలీం. ఆయన రచనలు దక్షిణాదిభాషలతో సహా హిందీ, ఒరియా, మరాఠిభాషల్లోకి అనువాదమయ్యాయి. ఈ ‘మాయా జలతారు’ సంపుటిలోని 16 కథలూ నవ్య వీక్లీ సహా పలు పత్రికల్లో వచ్చినవే. 

ఆత్మాన్వేషణతో అలౌకికమైన జీవితాన్ని గడిపే ఓ తాత్వికుడి చుట్టూ జేరిన అమాయక జనాన్ని భక్తిపేరిట, మతం పేరిట వ్యాపారం పేరిట దోచుకునే ‘ప్రబుద్ధుల’ నిర్వాకానికి దర్పణం పట్టేదే టైటిల్‌ కథ ‘మాయా జలతారు’. ప్రేమ పవిత్రతను, ఆ ప్రేమకోసం ఆరాటపడే మనసునూ ఒక చిన్న ట్విస్టుతో వివరించిన భిన్నమైన కథ ‘మూడోపాదం’. ఇలా ఇందులో కథలన్నీ మనతో వేగంగా చదివిస్తాయి.

 

మాయా జలతారు
సలీం
ధర 150 రూపాయలు
పేజీలు 164
ప్రతులకు జెవి పబ్లికేషన్స్‌, ఫోన్‌ 80 963 10 140 మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు