గ్లోబలైజేషన్‌ బారినపడిన స్థానిక బతుకుల్ని కవిత్వంలో చెప్పి ఓ ఖాళీని పూరించిన యూత్‌ఫుల్‌ కవి సురేంద్ర దేవ్‌. యూత్‌ఫుల్‌ ఇండియమ్‌తో థాట్‌ఫుల్‌ కవిత్వాన్ని పండిస్తున్న కవి. మచ్చుకి చూస్తే, ప్యాక్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌/తాగి తాగి చప్పబడిన నాలుకకు/రైతు సొరబుర్రలోంచి/నా దోసెట్లో పోసిన దాహార్తి సంజీవని/రుచి మొగ్గలకు పునర్జన్మనిచ్చింది.......రోటి పచ్చడి వెన్నపూసలు జిహ్వను తాకగానే/కోల్పోయిన గ్రామీణ జీవిత విలువ అర్థమై/తలచి తలచి ఏడవసాగాను...అంటారు టైటిల్‌ కవిత ‘నడిచే దారిలో...’.లక్ష్మీనర్సయ్యగారు ముందుమాటలో చెప్పినట్టు గాఢత, స్పష్టత, తాజాత్వం కలగలిసిన కవిత్వమిది. 

 

నడిచే దారిలో....
సురేంద్ర దేవ్‌ చెల్లి
ధర 100 రూపాయలు
పేజీలు 124
ప్రతులకు రచయిత, యానాం,533 464 సెల్‌ 9849878751 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు