తిరుగుబాటు ఒక ఆధ్యాత్మిక వ్యవహారం అంటారు ఓషో. అది సమాజానికి వ్యతిరేకం కాదు. హింసకు అనుకూలం కాదు. ప్రేమ, కరుణ, అవగాహన, నిశ్శబ్దం వంటి దివ్యత్వ గుణాలనుంచి పుట్టే తిరుగుబాటు నూతన సమాజాన్ని సృష్టిస్తాయంటారాయన. ఈ ప్రపంచాన్ని పూర్తిగా పునరుద్ధరించాలి. పాత విలువలకు వీడ్కోలు పలికి, నూతన విలువలు స్థాపించాలి. అది ధార్మిక తిరుగుబాటువల్లే సాధ్యం. అలాంటి తిరుగుబాటుతో రెబెల్‌ సమాజానికి చైతన్యవంతమైన మార్పునిస్తాడంటారు ఓషో. ఇరవై శీర్షికలున్న ఈ ఆలోచనల సమాహారం మనల్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది. 

 

రెబెల్‌
ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం భరత్‌
ధర 250 రూపాయలు, పేజీలు 208
ప్రతులకు ధ్యానజ్యోతి పబ్లికేషన్స్‌, పోస్టుబాక్స్‌ నెం 1, జె.జె.నగర్‌ కాలనీ పోస్టాఫీస్‌, యాప్రాల్‌, సికింద్రాబాద్‌–87