సామాజిక పరిశీలకుడు, రచయిత, వ్యాసకర్త రామస్వామి.ఆధ్యాత్మిక, తాత్విక సాహిత్య అధ్యయనకారుడు. ఉద్యోగరీత్యా, పర్యాటక ఆసక్తితోనూ పలుదేశాల్లో సంచరించి భిన్నసంస్కృతులను, జీవనరీతులను ఆకళింపు చేసుకున్నారు. తనదైన ప్రత్యేక అనుభవంతో ఇప్పటికే దేశవిదేశీ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. నోబెల్‌ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ మెక్సికన్‌ కవి ఆక్టేవియో పాజ్‌ రాసిన Sunstone దీర్ఘకావ్యానికి రామస్వామి తెలుగు అనువాదం ఈ ‘సూర్యశిల’. ఇదొక రసరమ్య కావ్యం. వస్తుశిల్పాల్లో మూలరచయిత చూపిన వైవిధ్యం, పాఠకులకు సృజనాత్మక అనుభవాన్నిస్తుందన్నది ప్రచురణకర్తల మాట.

 

సూర్యశిల
మెక్సికన్‌ కవిత్వం
నోబెల్‌ బహుమతి గ్రహీత ఆక్టేవియో పాజ్‌
అనువాదం నాగరాజు రామస్వామి
ధర 100 రూపాయలు, పేజీలు 148
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, భాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌–44 
మరియు టి.రామమోహనరావు సెల్‌ 970 15 222 34