సంస్కృతి ప్రతిబింబాలు 

సంక్షోభ భరిత వర్తమానాన్ని అత్యంత సంప్రదాయకంగా, సంస్కారయుతంగా ‘భారతీయత’ కోణంలో చిత్రించిన స్కెచ్‌లు గుండు సుబ్రమణ్య దీక్షితుల కథల సంపుటి ‘అమ్మ అజ్ఞానం’. తొలితరపు తెలుగు కథలోని ఉదాత్తత, భావుకత, సంస్కరణ ఈ సంపుటిలోని 32 కథల్లో చోటుచేసుకుని ఆ కోవకు చెందిన పాఠకులను ఆహ్లాదపరుస్తుంది. సమకాలీన మధ్యతరగతి జీవితాల ఆనంద, విషాదాలకు, అలజడి ఆందోళనలకు భారతీయ సంస్కృతి- వారసత్వంలో సమాధానాలు వెతికి చూపించిన కథలివి. భారతదేశ నలుమూలల సంస్కృతిని ఇందులోని పర్యాటక కథలు పాఠకులకు పరిచయం చేయడం ఈ సంపుటిలోని ఒక ప్రత్యేకత. 
- డా. డి. లెనిన్‌
 
అమ్మ అజ్ఞానం 
గుండు సుబ్రమణ్య దీక్షితులు 
పేజీలు : 248, వెల : రూ.125 
ప్రతులకు : 0866 - 2436643