సాహిత్య సేనాని
 
 
చలసాని ప్రసాద్‌ గారికి సరిగ్గా సరిపోయే పేరు సాహిత్య సేనాని. అలా అని ఆయన వెనకేదో పెద్ద సైన్యం వుందనుకుంటే పొరపాటే. ఆయనే రాజు, ఆయనే బంటు. వన్‌ మాన్‌ ఆర్మీ అన్నమాట. సాహిత్యం, సినిమా, ప్రజా ఉద్యమాలపై సాధికారికంగా స్పందించగల అధ్యయనం, అనుభవం ఆయన సొంతం. సునిశితమైన దృష్టి, విస్తృతమైన అధ్యయనం ఉన్నప్పటికీ చలసానిగారు సొంతంగా రాసినవాటికంటే ప్రతి స్పందనలే ఎక్కువ. మరికొన్ని నివాళులు, ముందుమాటలు. ప్రజానుకూల ఉద్యమాలపై, ప్రజలకు మేలు చేసే సాహిత్యంపై ఈగ వాలకుండా చూసుకున్నారని ఇందులోని వ్యాసాలను చదివితే అర్థమవుతుంది. విమర్శకు ఆయన దిద్దిన ఒరవడికి ఈ వ్యాసాలే సాక్ష్యాలు.  
 - దేరా
 
చలసాని ప్రసాద్‌ సాహిత్య సర్వస్వం-1 
పేజీలు: 615, వెల: రూ. 270
ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు