పాఠకుల మెదళ్ళకు చక్కని మేత ‘గణితంలో వినోదం’. లెక్కలంటే భయపడేవారు తప్పక చదవాల్సిన పుస్తకమిది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరం. వివిధ గణిత సమస్యలను సులువుగా ఎలా చేయవచ్చో వివరించారు. ఆడుతూ పాడుతూ లెక్కలను ఎలా చేయాలో తెలియజేస్తుందీ పుస్తకం. మొత్తం 135 సమస్యలు పాఠకుల జ్ఞాపకశక్తిని, గణితంపై ఆసక్తిని కలిగిస్తాయి. 

-లక్ష్మీ నర్మద

 

గణితంతో వినోదం
మూల రచయిత: యాకొవ్‌ పెరెల్మాన్‌
అనువాదం: పి. రాజేశ్వరరావు
వెల: 80 రూ.
పేజీలు: 118
ప్రతులకు: నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుస్తక విక్రేతలు