పిల్లలను నిద్రపుచ్చడానికి అనగనగా ఒక ఊళ్ళో... అంటూ కథ చెప్పడానికి రెడీ అయిపోతారు అమ్మమ్మలు, తాతయ్యలు. ఇదంతా ఒకప్పటి సంగతి. మరి నేడు? కథలు చెప్పడానికి తల్లిదండ్రులకు తీరికెక్కడిది? ఉమ్మడి కుటుంబాలెక్కడివి? అలాంటి వారికోసమే ఈ పుస్తకం.

రోజుకో కథ చొప్పున సంవత్సరమంతా చదువుకునేలా 365 నీతికథలను మనకందించారు రచయిత. పుస్తక పఠనం గగనమైపోతున్న ఈ రోజుల్లో పిల్లలకోసం, ప్రత్యేకంగా నీతికథ ప్రధానాంశంగా పుస్తకం రావడం ముదావహం. వినోదం, చమత్కారం మిళితమైన కథలు అక్కడక్కడ బొమ్మలతో పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ఈ మంచి నీతిపుస్తకాన్ని.

-లక్ష్మీ నర్మద 

రోజుకో నీతి కథ
రచయిత: పి. రాజేశ్వరరావు
వెల: 250 రూ.
పేజీలు: 350
ప్రతులకు: నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుస్తక విక్రేతలు