ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి...ఇత్యాది అంశాలను సుదీర్ఘంగా విశ్లేషిస్తూ సాగిన నవల ‘రుణం’. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కలం నుంచి జాలువారిన రచన. ప్రముఖ వారపత్రికలో సీరియల్‌గా అభిమానులను అలరించింది.
అందరూ తప్పులు చేస్తారు. కానీ తప్పును తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలనుకునేవారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకునేవారు కొందరే ఉంటారు. అలా చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకునే వ్యక్తి మనోభావాల, ఆలోచనల, సమ్మిళితమే ఈ నవల. విశ్లేషణలు, మాతృభాష కమ్మదనం, సంఘజీవన ఆవశ్యకత పాఠకులను కట్టిపడేస్తాయి. ‘నాకోసం నేను కాకుండా ఒకరికోసం ఒకరు’ అనే అంశాన్ని కథావస్తువుగా తీసుకుని సాంఘిక విలువలను జోడించారు రచయిత. ఆద్యంతం ఆసక్తికరం.


 -లక్ష్మీ నర్మద


రుణం
రచయిత: గొల్లపూడి మారుతీరావు
వెల: 250 రూ.
పేజీలు: 288
ప్రచురణ: క్రియేటివ్‌లింక్స్‌ పబ్లికేషన్స్‌
1-8-725/ఎ/1, 103 సి, బాలాజి భాగ్యనగర్‌ అపార్ట్‌మెంట్స్‌,
నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044
ఫోన్‌: 9848065658, 8885446222, 9848506964.
ప్రతులకు: విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవచేతన, ప్రజాశక్తి, నవోదయ, తెలుగు బుక్‌హౌస్‌లు, ఇంకా ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో
online: kinige.com, telugubooks.in, logili.com, anandbooks.com