మంచిని చెప్పే సినిమా కబుర్లు
ఒకనాడు సినీ కబుర్లకు మీడియాలో అంత ప్రాధాన్యం ఉండేది కాదు. అప్పుడు ‘విజయచిత్ర’ పాత్ర ఇతోధికం. ఉన్న మంచినే చెబుతాం... ఉన్నా చెడు చెప్పం అన్నది ఆ పత్రిక కట్టుబాటు. ఈ పుస్తకం విషయంలోనూ అదే కట్టుబాటును రచయిత ప్రదర్శించారు. ఆనాడే ఉత్తరాది, దక్షిణాది తారలతో ముఖాముఖి ఏర్పాటుచేసి పాఠకులకు పసందుగా పలు విశేషాలను అందించడం ఒక ప్రత్యేకత. కొన్ని నిజాలు తెలిసినా రాయలేని పరిస్థితిని చక్కగా వివరించారు. పాత్రికేయుల జంఝాటాలు, తెరవెనుక రాజకీయాలను ప్రస్తావించిన క్రమంలో కొన్నిచోట్ల లోతైన చర్చ చేశారు. సినీ జర్నలిజంలోకి అడుగుపెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
- మద్దిపట్ల మణి
విజయచిత్ర జ్ఞాపకాలు, బి.కె.ఈశ్వర్
పేజీలు: 288, వెల: రూ.175
ప్రతులకు: సాహితి ప్రచురణలు, విజయవాడ