‘‘సార్‌... మా అబ్బాయి సంతోష్‌ కన్పించడం లేదు...’’సీరియస్‌గా ఓ కేసు తాలూకూ ఫైలు చూస్తున్న ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తలపైకెత్తాడు. ఎదురుగా ఓ పెద్దాయన దీనంగా ముఖం పెట్టి నిల్చున్నాడు.‘‘ఎంత వయసుంటుంది... ఏం చేస్తుంటాడు?’’‘‘28 ఏళ్లుంటాయి సార్‌... ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు’’‘‘వెళ్లేప్పుడు ఇంట్లో చెప్పలేదా ఎటెళ్తున్నాడో...’’‘‘పని మీద వేరే ఊరికి వెళ్తున్నానంటూ పదిరోజుల క్రితం ఎస్సెమ్మెస్‌ ఇచ్చాడు సార్‌...’’

‘‘పది రోజుల క్రితమా? తర్వాత తిరిగి ఫోన్‌ చెయ్యలేదా...?’’ అలెర్టవుతూ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘ఆ తర్వాత మా అబ్బాయి ఫోన్లు రెండూ స్విచ్ఛాఫ్‌ అయ్యాయి... చాలా చోట్ల వెతికాం కానీ ఎక్కడా మాకు ఎలాంటి ఆధారం దొరకలేదు’’‘‘కంపెనీ పని మీద ఏమైనా వెళ్లాడేమో ఎంక్వయిరీ చేశారా?’’‘‘కంపెనీ వాళ్లకు కూడా మా వాడు మెసేజ్‌ ఇవ్వలేదు... కంపెనీ వాళ్లు మమ్మల్నే అడుగుతున్నారు...’’ అంటూ ఏడుపు మొదలెట్టాడు.‘‘అయ్యో పెద్దాయనా ఏడ్వకు... ఇంతకూ నీ పేరేంటీ...’’‘‘నర్సింహారెడ్డి సార్‌...’’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.‘‘ ఫిర్యాదు చేశావు కదా. ఏం ఫర్వాలేదు వెదుకుదాం. మిగతా వివరాలిచ్చి నువ్వు ఇంటికెళ్లు...’’ఫఫఫహైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్‌ పోలీసుస్టేషన్‌ ...నగరంలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసు ఠాణా...ఎక్కువగా కేసులు నమోదయ్యేది అక్కడే.

సంతోష్‌ కన్పించడం లేదనే ఫిర్యాదు అందగానే షరా మామూలుగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.‘సంతోష్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ డిటైల్స్‌ తెప్పించమ’ని ఎస్సై సైదులుని ఆదేశించారు ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌. ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలిస్తే సంతోష్‌ తనకు తాను స్వయంగా ఇంట్లోనుంచి వెళ్లినట్లు ఉంది. చివరిసారిగా తండ్రికి ఎస్సెమ్మెస్‌ ఇచ్చాడు. తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. అలా ఎందుకు జరిగింది? ఏమైనా ప్రేమవ్యవహారం ఉందా? ఎవరితోనైనా పాత కక్షలున్నాయా?సంతోష్‌ ఎక్కడికెళ్లి ఉంటాడో తేలాలంటే ముందు అతని సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్లు తెప్పించాలి. అదే విషయాన్ని ఎస్సైకి సూచించారు ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌.ఫఫఫసంతోష్‌ కాల్‌ డిటైల్స్‌, టవర్‌ లొకేషన్‌ త్వరగానే పోలీసుల చేతికి అందింది.అందులో సంతోష్‌ ఇంటి నుంచి వెళ్లిన రోజున ఒక నెంబర్‌కు చాలాసార్లు కాల్‌ చేసినట్లు గుర్తించారు ఎస్సై సైదులు.