వస్తువుల్ని కుదవపెట్టుకుని వ్యాపారం చేస్తాడతను . యాభై ఏళ్ళుగా అదే వ్యాపారం . కొడుకు వృద్ధిలోకి వచ్చాడు . వ్యాపారం వదిలేయమనీ, విశ్రాంతి తీసుకోమనీ ఎన్నిసార్లు చెప్పినా ఆ తండ్రి వినలేదు. ఇంతలో అల్లర్లు జరిగాయి. బజారులో దుకాణాలు తగులబెట్టారు. అతడి తండ్రిని కూడా కాల్చి చంపారు. కానీ ఆ కొడుకు మాత్రం ఇది అల్లరి మూకల పని కాదంటున్నాడు. హత్యే అంటున్నాడు. నిజమేనా? డిటెక్టివ్‌ శరత్‌ ఏం చేశాడు?

‘మా నాన్నగారి మరణాన్ని మీరు మరొకసారి పరిశీలించాలి. పోలీసులు దాన్ని దమనకాండలో భాగాంగా కొట్టేస్తున్నారు. సీరియస్‌గా పరిశోధించలేదు. మీరు కేసును టేకప్‌చేసి పరిశోధించి హంతకుడిని పట్టుకోవాలి’’ ఆవేశంగా పిడికిళ్ళు బిగించి చెప్పాడు చిరాగ్‌పటేల్‌.వస్తువులను కుదవ పెట్టుకుని డబ్బులిచ్చే వ్యాపారం చేసేవాడు. కొడుకు చిరాగ్‌ పటేల్‌ను పెద్దగా చదివించాడు. అతు పెద్ద వ్యాపారిగా ఎదిగాడు. కానీ ‘‘యాభై ఏళ్ళుగా చేస్తున్న వ్యాపారం వదలలేను’’ అనేవాడు సహజ్‌ పటేల్‌. విశ్రాంతి తీసుకోమని ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా తన దుకాణం నడిపేవాడు.ఒకరోజు అనుకోకుండా పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. దుకాణాలు తగుల బెట్టారు. సహజ్‌ పటేల్‌ దుకాణం కూడా తగులబెట్టారు. అతడిని కాల్చి చంపారు. పోలీసులు పరిశోధించారుగానీ, నేరస్తులెవరో నిర్థారించలేకపోయారు. అందుకే డిటెక్టివ్‌ శరత్‌ని అడుగుతున్నాడు చిరాగ్‌పటేల్‌.

శరత్‌ చాలాసేపు ఆలోచిస్తూ కూచున్నాడు. ‘‘డబ్బు గురించి ఆలోచించకండి’’ అన్నాడు చిరాగ్‌ పటేల్‌.శరత్‌ నవ్వాడు. ‘‘అది పథకం ప్రకారం చేసిన హత్య అనుమానించటానికి కారణాలేమిటా అని ఆలోచస్తున్నాను’’ వెతుకుతున్నాను’ అన్నాడు శరత్‌.‘‘ప్లీజ్‌! ఎలాగైనా....’’‘‘ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌తో మాట్లాడి చెప్తాను’’ అన్నాడు శరత్‌. ‘‘అల్లర్ల సమయంలో జనం గుంపులు గుంపులుగా వీధుల్లోకి వచ్చారు. రాళ్ళు రువ్వారు. రెండువర్గాల వారు కొట్టుకున్నారు. ఆ ప్రాంతంలో దుకాణాలను ధ్వంసం చేశారు. వ్యక్తులపై దాడులు చేశారు. సి.సి. కెమేరాల ద్వారా గూండాలను గుర్తించాం. పట్టుకున్నాం. కానీ ఆ షాపుమీద ఎవరు దాడిచేశారో, ఎవరు ఆయనను కాల్చిచంపారో తెలియటం లేదు’’ చెప్పాడు విజయ్‌.‘‘వాళ్ళ అబ్బాయి ఇది హత్య అంటున్నాడు’’