అమెరికాలో డాక్టర్.. అరుదైన వ్యాధితో అతడు అంథుడైపోయాడు.. అగ్రరాజ్యంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి.. భార్యా పిల్లలతో సహా భారత్‌కు వచ్చేశాడు.. లగ్జరీ ఇల్లు తీసుకుని కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చేశాడు. ఇంట్లో బోర్ కొడుతోందంటూ భార్య తన బాధను వివరించి.. చదువుకుంటానని భర్తతో చెప్పుకొచ్చింది.. కాలేజీలో తనకంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడు పరిచయమయ్యాడామెకు.. మొదట ఫోన్లతో పరిచయమై.. ఆ తర్వాత ఇంటికీ రాకపోకలు మొదలయ్యాయి. ఇంట్లో జరిగేదంతా ఆ భర్తకు తెలిసినా..

********************************

డాక్టర్‌ శ్రీనివాస్‌ ఫోన్‌ రింగ్‌ అయింది.‘‘యా..’’ అన్నాడు. అటునుంచి చెబుతున్న మాటలు విని ‘‘కమింగ్‌’’ అన్నాడు.హాల్లోకి వచ్చాడు. అతని భార్య పద్మ కనిపించలేదు.వారికి ఇద్దరు పిల్లలు. బాబు హరీష్‌. పాప శాలిని. హరీష్‌ సెకండ్‌ క్లాస్‌. శాలినిని ఈమధ్యే కిండర్‌గార్టెన్‌లో చేర్పించారు. అమెరికాలో ఉండే చాలామంది ఇండియన్స్‌ లానే పద్మే అన్ని పనులూ చేసుకుంటుంది. క్లీనింగ్‌ లేడీ వారానికి ఒక రోజు మాత్రమే వస్తుంది.ప్రతి ఉదయం ఆ ఇంట్లో చిన్నపాటి యుద్ధవాతావరణమే. 

 

పిల్లలిద్దరూ తెగ అల్లరి చేస్తారు. ఇంటినిండా బొమ్మలు, వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటారు. యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వారిని హ్యాండిల్‌ చేయడం, స్కూల్‌కి పంపించటం నిజంగా ఓ యజ్ఞమే. శాలిని చదువుతున్న స్కూల్‌ ఇంటికి దగ్గరే. పద్మే పాపను స్కూలుకు తీసుకెళ్ళి దింపుతుంది. హరీష్‌ బస్‌లో వెళ్ళిపోతాడు.ఆ రోజు ఓ క్రిటికల్‌ ఆపరేషన్‌ ఒకటి చేయాల్సి వచ్చింది. శ్రీనివాస్‌ అర్జంటుగా బయలుదేరాలి.అతని పిలుపుని కూడా పద్మ వినలేదు.

బాత్‌రూమ్‌లో నీటి చప్పుడు. శ్రీనివాస్‌ తన గదికి వెళ్లిపోయాడు. బయల్దేరేముందు చివరిసారి గుర్తుచేద్దామని కారు హారన్‌ మోగించాడు. అది విని చేస్తున్న పని వదిలి పరుగులు తీసుకుంటూ వచ్చింది పద్మ. కారు డోర్‌ అద్దాన్ని కిందకు దించి.. ‘‘ఆపరేషన్‌ ఉంది వెళ్తున్నా’’ అన్నాడు.ముఖం మీద పడిన ముంగురులు సవరించుకుంటూ..‘‘మరి బ్రేక్‌ఫాస్ట్‌...’’ అంది పద్మ.‘‘ఓన్లీ డిన్నర్‌’’ అంటూ కారుని ముందుకు కదిలించాడు.‘‘బై..’’ అంది. అతను చెయ్యి ఊపటం కనిపించింది. ఇంతలో ఇంటి లోపల పెద్ద శబ్దం. కంగారుగా ఇంట్లోకి పరుగులు తీసింది.