అందమైన తొలిరేయి.అగరొత్తుల పరిమళం. మల్లెపూల గుభాళింపు.కోటి కోరికలు మనసునిండా నింపుకుని శోభనం గదిలోకి అడుగుపెట్టింది నీహారిక. ఇంతకుముందు ఇటువంటి దృశ్యాలు చాలా సినిమాల్లో చూసి నవ్వుకునేది. కానీ ఇప్పుడు తనే ఆ సీన్‌లో ఉండేటప్పటికి కొంచెం టెన్షన్‌గా ఫీలవసాగింది. ఈమె పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే అక్కడ గదిలోపల బెడ్‌మీద పడుకుని అసహనంగా పొర్లుతూ నీహారికకోసం ఎదురు చూస్తున్నాడు ప్రహసిత్‌! క్షణమొక యుగం అంటే ఏమిటో అర్థం కాసాగింది అతనికి. ఇంకోవైపు అంతులేని సుఖం తన సొంతం కాబోతోందన్న ఆలోచన అతడిని ఉద్విగ్నతకు గురి చేస్తోంది.

నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని చేరుకుంది నీహారిక. ఆమెని దగ్గరకు తీసుకుని మెత్తగా హత్తుకున్నాడు ప్రహసిత్‌. మోహావేశంతో కళ్ళు మూసుకుంది నీహారిక. ‘ఫట్‌’మని బ్రాహుక్స్‌ తెగిన శబ్దం వినపడింది. ఆ తర్వాత ఏం చెయ్యాలో ప్రహసిత్‌కి ఎవరూ చెప్పలేదు. ఆటోమేటిగ్గా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పక్షికి ఎగరడం చేపకు ఈదడం ప్రకృతి నేర్పినట్లు అందమైన ఆమె శరీరాకృతి అతడికి అన్నీ నేర్పింది. క్షణాలో ఆమెను వివస్త్రను చేసి అరగంటపాటు ఆమె ఒంపుసొంపులతో ఆటలాడి అలసిసొలసి పక్కకు వాలిపోయాడు. తృప్తినిండిన కళ్ళతో అతడి మొహంలోకి చూస్తూ మైమరిచిపోయింది నీహారిక. సడన్‌గా మెలకువ వచ్చింది నీహారికకు. లేచి కూర్చుంది. టైము అర్ధరాత్రి దాటి అరగంట.

అద్భుతమైన కల! తన మనసుని ఆనంద శిఖరంమీదకు తీసుకెళ్ళి అక్కడినుంచి నిర్దాక్షిణ్యంగా లోయలోకి తోసేసిన కల. ఇదే కల ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చింది. బంగారంలాంటి తన నిద్ర పాడు చేసింది. పగటి పూట ఏదో ఒక పని చేసుకుంటూ తనలో రగిలే ఆ ఆలోచనలని అణిచేసుకున్నా, రాత్రిపూట కలలరూపంలో వచ్చి ఆ ఆలోచనలన్నీ తనను ఏడిపిస్తున్నాయి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.