అంతకు కొన్ని క్షణాల ముందు జరిగిన సంఘటన నుంచి తేరుకుని చీరకొంగును చుట్టూతిప్పి బొడ్లో దోపుకునినిటారుగా నిలబడింది ఆమె. అతడి కళ్ళముందు తన హోటల్లో గోడలకి తగిలించిన ఆడవాళ్ళ బొమ్మలు కళ్ల ముందు మెదిలాయి. అవేవీ ఇప్పుడీమె నిలబడిన తీరుకి సరిపోలవని అనిపించాయి.

మరుక్షణంలో తల విదిలించుకుని తన రెండు చేతులతో జుట్టు ముడి వేసుకుంటూ అనిందామె, ‘‘అన్నీ వదిలేసుకుని వచ్చేస్తావా అయితే?’’ఆమె ప్రశ్నకు జవాబు వెతుక్కున్నాడు అతడు. అప్పటికున్న తన ఆస్తులన్నీ ఆ పరిమళం ముందు దిగదుడుపే అనిపిస్తూ ఆ పరిమళం అతడిని శాసించింది.ఫ ఫ ఫఅతడొక అనాథ. చిత్తుకాగితాలు ఏరి అమ్ముకుని జీవించే తల్లి, తండ్రి చచ్చిపోయి అతడికి ఒంటరి జీవితాన్ని మిగిల్చారు. అప్పటికి తన వయసు కేవలం ఎనిమిదేళ్లు. అక్కడినుండి అతడికి ప్రపంచం విశాలంగా కనిపించింది. ఈ కొత్త ప్రపంచపు విశాలత్వం ప్రసాదించిన స్వేచ్ఛ ఒంటరితనాన్ని క్రమంగా మరిపించసాగింది.కొన్నాళ్ళు చిత్తు కాగితాలు ఏరి అమ్ముకున్నాడు. వీధుల్లో తిరిగి అడుక్కున్నాడు. హోటల్లో పనిచేసాడు. ఏ పని దొరికితే ఆ పని చేసి పొట్ట పోసుకున్నాడు. అనేక రాత్రుళ్లు కన్నీరు కార్చాడు. అనేక పగళ్లు కసితో పళ్ళు కొరికాడు.

భూగోళం సూర్యుడి చుట్టూ పది ప్రదక్షిణలు చేసేంత వరకు దారిద్య్రం, ఒంటరితనంరెండూ కలిసి అతడి చుట్టూ కరాళ నృత్యం చేశాయి.ఆ దుఃఖానికి ఉపశమనంగా ప్రకృతి అతడిలో నూనూగు మీసాల పరువాన్ని ప్రవేశపెట్టింది. ఆ కారణంగా అతడికి అన్ని దుఃఖాల మధ్యన కూడా ప్రపంచం కొత్తకొత్త రంగులలో కనపడసాగింది. నిరంతరం తనని వేధించే ఆకలికి ఏదోరకంగా కడుపు నింపుకున్న ప్రతిసారీ ఇంకేదో కొత్త ఆకలి కంగారు పెట్టసాగింది.ఒకప్పుడు వీధిలో ముగ్గులేస్తున్న యువతులను చూడగానే ముగ్గులు మాత్రమే కనబడేవి. ఇప్పుడు ముగ్గులు కాకుండా అందమైన చేతులు ... ఆ చేతులకు ఉన్న గాజులు గలగలమని శబ్దం చేస్తాయని, వారి జడలో పువ్వులు ఉన్నాయనే గమనిక కలిగింది. ఆ పువ్వులకి అనేక పరిమళాలు ... వారి చున్నీల వెనక తనకి లేని మెత్తటి అవయవాలు ఉన్నాయని కూడా గ్రహింపు కలిగింది.