బాల్యంలోనే కన్నతండ్రి మరణించడంతో త్యాగమూర్తిగా మారిందామె. ఇద్దరు చెల్లెళ్ళను తమ్ముణ్ణి చదివించి పెళ్ళిళ్ళు చేసింది. ఇప్పుడు అంతా హ్యాపీ. కానీ ఆమె యవ్వనం కాలంతోపాటే కరిగిపోయింది. ఇక అతని సంగతి. పేదరికం భరించలేక వదిలివెళ్ళిపోయిందతని భార్య. కోరికలన్నీ వదులుకుని కసితో సంపాదించి ఎదిగాడతను. స్ర్తీలంటే ద్వేషం పెంచుకున్నాడు. చివరికి వీరి జీవితాల్లో కొంచెమైనా వెలుగు ప్రసరించిందా?

నేను చాలా అదృష్టవంతురాలినండీఊహు..నీకన్నా నేనే ఎంతో అదృష్టవంతుణ్ణిఎలా?!నీలాంటి అందమైన సుందరీ, పరువాల పందిరీ ప్రతీరోజూ ఇలా అందాలవిందు చేస్తూఉంటే....ఉంటే....?మగాడికి స్వర్గంతో పనేముంది, హాయిగా...హాయిగా....?నీ అధరామృతాన్ని గ్రోలుతూ, నీ కౌగిలిలో బందీ అవుతూ...అవుతూ....?రసకేళీ చక్కర కేళీల్ని తనివితీర్చే వలపుల తేనెల ఊటలతో కలిపి ఆస్వాదిస్తూ, ఇంకా...ఇంకా....?సరస కవిత్వం చెప్పుకుంటూ మన్మథ చరితం చదువుకుంటూ...అబ్బా....?ఏవైందీ.....?ఓ వైపు రసకవిత్వం చెబుతూనే మరోవైపు నా ఒళ్ళంతటినీ తెల్లకాగితం చేసుకుని కవ్వింతల కలంతో రాసేస్తున్నారుగా...అబ్బా...ఊఁ...అలాగా....?!ఊ...ఏం తెలియనట్టు...నంగనాచి...సరస సవ్యసాచి.ఓహో, నీకూ కవిత్వం వచ్చేస్తోందే....?!సహవాసం సమభాగం కదూ మరి....టక్‌...టక్‌....టక్‌....

అమ్మగారూ...అమ్మగారూ...టక్‌...టక్‌...టక్‌...తుళ్ళిపడింది లత!నేనండీ పనిమనిషిని. తలుపుతియ్యండి అమ్మగారూ!======ఆ ముఖ్యమైన కాగితాలు తన టేబుల్‌మీద పదిగంటలకల్లా ఉండాలన్న ఆదేశం అమలు జరగలేదు! పంక్చువాలిటీలో గడియారం ముల్లంత కచ్చితత్వం..పనిపట్ల ఉడుముపట్టులాంటి అంకితభావం..ప్రణాళికల్లో యుగంధరుడి మనస్తత్వం అతన్ని ఓ బట్టల దుకాణం గుమాస్తా స్థాయి నుండి క్యూ...క్యూ...ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ సంస్థ అధిపతిస్థాయికి తీసుకువచ్చి గౌరవించాయి!అతను ఇంటర్‌కమ్‌లో మళ్ళీ అడిగాడు.

ఆమె ఇంకా రాలేదు సర్‌లీవు పంపించారా...?లేదు సర్‌ఎక్స్‌ప్లనేషన్‌ కాల్ఫర్‌ చేయండి. ఈ రోజు శాలరీ కూడా డిడక్ట్‌ చెయ్యండి. అలాగే సర్‌.సర్‌ ఇప్పుడే ఆమె వచ్చారు సర్‌.గెట్‌ హెర్‌ ఇంటూ మై ఛాంబర్‌...ప్లీజ్‌ ఫాలో హెర్‌.కృష్ణదేవ్‌లో ఒక రాక్షసుడున్నాడు. అతడిపేరు పని. అతనిలో ఒక దేవుడున్నాడు. పనిమంతులకు వరాలిచ్చే వరదుడు! ఇప్పుడు అతనిలో రాక్షసుడే ఉన్నాడు!మే ఐ కమిన్‌ సర్‌...........మే...ఐ...గెటిన్‌...టైమ్‌ ఎంతైందో చూసుకున్నారా?స...స్సారీ సర్‌...వెరీ సారీ సర్‌సారీస్‌ నెవర్‌ ఎఛీవ్‌ ద టార్గెట్స్‌. వేరీజ్‌ పేపర్స్‌ ఇన్‌పుట్‌...?ఇప్పుడే తెస్తాను సర్‌.వాటిని అప్‌డేట్‌గా కనెక్ట్‌చేసి ఆప్‌లోడ్‌ చేశారా?చేస్తాను సర్‌..సారీ సర్‌...నిన్ననే చేసేశాను సర్‌....పుట్‌ దెమ్‌ హియర్‌ ఇమ్మీడియట్లీ