‘‘దత్తత తీసుకుందామా!’’మా ఆవిడ మాటను నేను పట్టించుకోలేదు.‘‘మనం దత్తత తీసుకుందామా!’’అయినా నేను చదువుతున్న పేపర్‌లోంచి తలెత్తలేదు.‘‘ఏమండోయ్‌... మిమ్మల్నే... అడిగేది! మనం దత్తత తీసుకుందామా’’!చదువుతున్న పేపర్‌ లాక్కుని... మరీ ప్రక్కన చేరింది.

‘‘ఏమిటే... నువ్వనేది?’’తాపీగా కళ్ళజోడు తీసి కర్చిఫ్‌తో తుడుచుకుని ఆమె వైపు చూచాను.‘‘అదేనండీ! మనం ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటే బాగుంటుందనిపిస్తోందండీ!’’ గోముగా బుంగమూతి పెట్టి కళ్ళల్లోకి చూచింది.‘‘నీకు ఇప్పుడా ఆలోచన ఎందుకు వచ్చిందో... తెలుసుకో వచ్చా!’’జిల్లా ఎడిషన్‌ పేపర్‌ తెరచి చూపించింది.అది... వృద్ధాశ్రమ ప్రారంభోత్సవ విశేషం! అందులో నమో దైన వృద్ధుల వివరాలు ఉన్నాయి. వారికి సహాయ మందిస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలున్నాయి.వృద్ధుల జీవిత విశేషాలున్నాయి. వాళ్ళు ఎందుకు వృద్ధాశ్రమంలో చేరవలసి వచ్చిందో... విశ్లేషణలున్నాయి. సెంటర్‌స్ర్పెడ్‌ ఛాయాచిత్రాలతో ఆర్ద్రంగా... గుండెలను, కనులను చెమరింపచేసేలా కనువిందు చేస్తున్నాయి.‘‘వారిలో ఎవరినో ఒకరిని మనం దత్తత తీసుకుంటే బాగుంటుందేమోనని’’ ఆశగా నావైపు చూచింది.

క్షణకాలం ఆమె వైపు చూచి వృద్ధుల వివరాల వైపు దృష్టి సారించాను.నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి ఇచ్చిన కన్న తల్లిని కాలదన్నిన కసాయి కొడుకులు కొందరు! తండ్రి చిన్నతనంలోనే గతించిపోతే... కాయకష్టం చేసి పెంచు కొన్న కొడుకులు కాదనుకొన్న తల్లులు కొందరు! విద్యా బుద్ధులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసిన తరువాత... ఆ కోడళ్ళ ఆదరణ ఫలితంగా అనాధలై వృద్ధాశ్రమం చేరిన తల్లులు... తండ్రులు... మరికొందరు! వృద్ధాశ్రమంలో అధికంగా నమోదైన వారు మహిళలే!ఎప్పుడో చదివిన ఓ మినీ కవిత జ్ఞాపక మొచ్చింది.

వాడు అమ్మను ఏడిపించాడు...చిన్నప్పుడు అన్నం తినడాన్కి!వాడు అమ్మను ఏడిపిస్తూనే ఉన్నాడుఇప్పుడు అన్నం పెట్టడాన్కి!క్షణకాలం కనుకొలకులను కన్నీటి బిందువులు కనికరించాయి.అందరి వృద్ధుల వెనకా ఓ చరిత్ర ఉంది. అందరిలోనూ ఓ వేదన ఉంది.అందరూ... తమ కండల్ని కరిగించి నిస్వార్థంగా పెంచి పోషించినవారే! అందరి అయినవాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళే! రెండు చేతులా సంపాదించేవాళ్ళే! అయినా... కన్నవాళ్ళు వాళ్ళకు బరువైపోయారు! కన్న తల్లులు వాళ్ళకు కాని వాళ్ళైపోయారు! అందరూ వృద్ధాశ్రమాలు చేరుకున్నారు.ఎప్పుడో చదివిన వేమన పద్యం జ్ఞాపకమొచ్చింది.‘‘తల్లి యోకటె సాగు తనయుల పదిమంది