తెనాలి (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 26 నుంచి 28 వరకు తెనాలిలో తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్టు ఈ సంబరాల ఆహ్వాన కమిటీ చైౖర్మన్‌ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వక్తలు, సాహితీవేత్తలు విచ్చేస్తున్నారని, సాహిత్య తెలుగు సమ్మేళన సభలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.తొలిరోజు కార్యక్రమాలను రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌ ప్రారంభిస్తారని, ముఖ్యఅతిఽథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొంటారని వివరించారు. సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు, సినీ గేయరచయిత జొన్నవిత్తుల, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ విజయభాస్కర్‌, ప్రముఖ కవి నగ్నముని, శ్రీరమణ, పొత్తూరి వెంకటేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరా వు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మరికొందరు సాహితీవేత్తలు హాజరవుతునట్టు తెలిపారు.