పీటర్‌ హండ్కె ఎంతో వివాదాస్పదమైన రచయిత. సెర్బియాలో నరమేధం జరుగుతున్న సమయంలో నాయకుడుగా వున్న మిలోసెవిక్‌ పాత్రని సమర్థించాడు. హండ్కె పేరుని ప్రకటించినప్పుడు స్టాక్‌హోమ్‌లోని ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. కాని స్వీడిష్‌ అకాడమీ ‘‘భాషా చాతుర్యంతో అతడు తన రచనలలో మానవ అనుభవాల వైశాల్యాన్నీ, నిర్దిష్టతనీ చూపాడు’’ అని వ్యాఖ్యానించింది.

ఓల్గా టోకార్‌జుక్‌కు నోబెల్‌ పురస్కారాన్ని ఇచ్చిన కారణాలు ఇవి: ‘‘ఆమె తన రచనా పాటవంతో ఊహాబలంతో, విజ్ఞాన సర్వస్వ సమానమైన భావావేశంతో- సరిహద్దులు చెరిపి వేయటాన్ని ఓ జీవన విధానంగా చూపిస్తుంది.’’
 
కొన్ని అసాధారణ కారణాల వలన స్వీడిష్‌ అకాడమీ గత సంవత్సరం సాహిత్య నోబెల్‌ బహుమతిని ప్రకటించడం ఆపివేసి ఈ సంవత్సరంలో రెండు బహుమానాలనూ కలిపి ప్రకటించాలనుకున్న నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ రెండు బహుమతుల ప్రకటనలు ఇవి:
2018 - ఓల్గా టోకార్‌జుక్‌ (పోలండ్‌)

2019 - పీటర్‌ హండ్‌కె (ఆస్ర్టియా)

పూర్తి వ్యాసం కోసం క్లిక్ చేయండి..