వైవిధ్యంగల ప్రపంచస్థాయి కథలను నాటికలుగా మలచే కొత్త ప్రయోగమే, అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్‌వారి పోటీల్లో ఎంపికైన నాటికల సంకలనం ఈ పుస్తకం. బాలగంగాధర్‌ తిలక్‌ కథ ఊరిచివర ఇల్లు, ఎ.ఎన్‌.జగన్నాథశర్మ కథ ‘గుర్తుతెలియనిశవం’ రామాచంద్రమౌళి ‘భూమిదుఃఖం’ లాంటి తొమ్మిదికథలు, ఆ నాటికలు ఇందులో ఉన్నాయి. అద్భుతమైన నాటికల్ని తెలుగువారికి అందించే ప్రయత్నమిది.

 

అజో–విభొ–కందాళం కథానాటికలు– 2018
ధర 228 రూపాయలు
పేజీలు 314
ప్రతులకు నవోదయ, విశాలాంధ్ర, తెలుగుబుక్‌హౌస్‌లు