మనదేశ అత్యుత్తమ కవులలో ఒకరు పద్మభూషణ్‌ గుల్జార్‌. ఆయన భావకవి, సినీదర్శకనిర్మాత,  ఫాల్కే అవార్డు గ్రహీత. హిందీ, ఉర్దూ, పంజాబీలలో పుంఖానుపుంఖాలుగా కవిత్వం రాశారు. జై హో...పాటరచనకు ఆస్కార్‌, గ్రామీ అవార్డులు పొందిన ఘనత ఆయనదే. గుల్జార్‌ గ్రీన్‌పోయెమ్స్‌ని పవన్‌ కే వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో తెలుగులోకి అనువదించారు ద్విభాషాకవి, జర్నలిస్టు వారాల ఆనంద్‌. ఇందులోని 58 కవితలన్నీ ప్రకృతికి సంబంధించినవే. మనిషి, ప్రకృతిమధ్య అనుబంధాన్ని ఎంతో సూటిగా, సున్నితంగా, సరళంగా చెప్పిన కవితలివన్నీ. 

 

ఆకుపచ్చ కవితలు
మూలం గుల్జార్‌
అనువాదం వారాల ఆనంద్‌
ధర 125 రూపాయలు
పేజీలు 156
ప్రతులకు ప్రోజ్‌ పొయిట్రీ ఫోరమ్‌, 8–4–64, హనుమాన్‌ నగర్‌, కరీంనగర్‌. సెల్‌ 9440501281