రచయిత తాళ్ళూరి సీతారామ హరగోపాల్‌ రామాయణాన్ని తేలికగా అర్థమయ్యేలా ఈ పుస్తకంలో మనకు అందించారు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండలోని ఘట్టాలను అతి సులభంగా అందరికీ అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో రాశారు. విశిష్ట స్తోత్రాలుకూడా ఇందులో చేర్చారు. ప్రజలనోళ్ళలో తారట్లాడే రామాయణంలోని ఎన్నో గొప్ప కథలతోపాటు మనకు అంతగా తెలియని కథలు ఈ పుస్తకంలో మనల్ని అబ్బురపరుస్తాయి. 

ఆధ్యాత్మ రామాయణం
తాళ్ళూరి సీతారామ హరగోపాల్‌
ధర 126
పేజీలు 320
ప్రతులకు ఎస్‌.ఆర్‌.బుక్‌ లింక్స్‌, దానయ్యవీధి, మాచవరం, విజయవాడ–04 

సెల్‌ 8142 444 988