మరాఠా రచయిత శరణ్‌కుమార్‌ లింబాళె. ‘అక్రమ సంతానం’ పుస్తకం ఆయన స్వీయ చరిత్ర. కులాధిపత్య వ్యవస్థ దౌష్ట్యాన్ని చాటిచెప్పే పుస్తకమిది. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి సందర్భంలోనూ కులం ఎలా వెంటబడి తరుముతుందో చెప్పే కథ. గ్రామీణ ఉత్పత్తి సంబంధాలు, బలమైన ఫ్యూడల్‌ సంబంధాలు, ఆధిపత్య కులాలు, ఆధిపత్య శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించే పీడిత కులాల వ్యథ ఈ పుస్తకం. రంగనాథ రామచంద్రరావు దీనిని తెలుగులోకి అనువదించారు. ‘ప్రజాసాహితి’లో ధారావాహికగా వెలువడింది ఆయన లింబాళె కథ. 

అక్రమ సంతానం

శరణకుమార్‌ లింబాళె
తెలుగు అనువాదం రంగనాథ రామచంద్రరావు
ధర 60 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు మైత్రీ బుక్‌ హౌస్‌, జలీల్‌ వీధి, కార్ల్‌మార్క్స్‌ రోడ్‌, విజయవాడ–02 
mail : ravibabujs@yajhoo.co.in