బాలల రచయిత పుట్టగుంట సురేష్‌కుమార్‌. ఒక దినపత్రికలో పదకొండేళ్ళపాటు ఆయన రాసిన 600 ‘తికమక కథలు’, ‘తమాషా కథలు’ విలక్షణమైన పజిల్స్‌తో రికార్డు సృష్టించారు. సరికొత్త ప్రయోగాలతో ఆయన పిల్లల్ని ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళే అద్భుతమైన తాజా బాలల నవల ఈ పుస్తకం. ఒక అల్లరిచీమ పాలపిట్ట ప్రోద్బలంతో అద్భుత యాత్రలుచేసి తన అహంకారం వదులుకుని మంచితం పెంచుకుంటుంది. పిల్లలు ఈ నవలతో వెంటనే కనెక్ట్‌ అవుతారు.

 

అల్లరి చీమ అద్భుత యాత్ర
పుట్టగుంట సురేష్‌ కుమార్‌
ధర 70 రూపాయలు
పేజీలు 96
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, రెహ్మన్‌ వీధి, అరండల్‌పేట, విజయవాడ–02 ఫోన్‌ 0866–2432813 సెల్‌ 9848082432