బాలసాహితీరత్న షేక్‌ అబ్దుల్‌ హకీం జాని. ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా, బాలసాహితీవేత్తగా పాతికేళ్ళుగా కృషి చేస్తూ, తన రచనలతో చిన్నారులకు తెలుగుభాషపట్ల మక్కువ పెంచుతున్నారు. ఇప్పటివరకు 61పుస్తకాలు రచించారు. పిల్లలకోసం 30 పుస్తకాలు, 200 కథలు రాశారు. పలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన తాజా పుస్తకం ‘అమ్మ ఒడి’ లో 33 కథలున్నాయి. పిల్లల్లో అశ్రద్ధ, నిర్లక్ష్యం, మొండితనం పోగొట్టి వారిలో ఆసక్తి, ఏకాగ్రతలతోపాటు, సోదరభావం, దయ, కరుణ వంటి భావనలను పెంపొందించే కథలివి.

 

అమ్మ ఒడి (పిల్లల కథలు బొమ్మలతో)
షేక్‌ అబ్దుల్‌ హకీం జాని
ధర 120 రూపాయలు
పేజీలు 120
ప్రతులకు:లక్ష్మీశ్రీనివాస పబ్లికేషన్స్‌, ఆర్టీసీ కాలనీ, హయాత్‌నగర్‌, హైదరాబాద్‌. సెల్‌ 810 69 89 394