కథ, నవలారచయిత్రి, భారతీయ రైల్వేలో ఉన్నతాధికారిణి డా.చెళ్ళపిళ్ళ సూర్యలక్ష్మి. ఇప్పటివరకు 20 కథలు, ఒక నవల రాశారు. ఒక వారపత్రిక నిర్వహించిన నవలాపోటీల్లో తృతీయ బహుమతి పొందిన నవల ఈ పుస్తకం. వాస్తవికతకు అద్దం పట్టిన నవల ఇది. పాఠకులను ఎనలైటెన్‌ (జ్ఞానవృద్ధి) చేయడమే ఈ నవల విశిష్టత. 

కార్యనిర్వహణా దక్షత, సమర్థత గల దివ్యాంగురాలైన టాప్‌ ర్యాంక్‌ ఉద్యోగిని చేతన కథ ఇది. తోటి అధికారులు, ఉద్యోగులు దివ్యాంగురాలైన ఆమె సమస్యల్ని అర్థంచేసుకోలేకపోయినా, ఆత్మస్థైర్యంతో చేతన తన వృత్తిధర్మాన్ని ఎలా నిర్వర్తించిందో చెప్పే కథ ఇది. సాటి మనుషులపట్ల ఎలా ప్రవర్తించాలో మనకు తెలియజెప్పే కథ ఇది.

అపజయాలు కలిగిన చోటే....

డా. చెళ్ళపిళ్ళ సూర్యలక్ష్మి
ధర 250 రూపాయలు
పేజీలు 188
ప్రతులకు సి.రత్నదుర్గ, రైల్వే ఆఫీసర్స్‌ కాలనీ, హుబ్బల్లి కర్ణాటక. సెల్‌ 97 31 49 22 99