ఆథర్స్‌ అండ్‌ స్టోరీస్‌ అనే పేరుతో రచయితలందరూ వాట్సాప్‌లో ఒక సమాహంగా ఏర్పడి సృష్టించిన అద్భుతమే ఈ కథల సంకలనం. ఇందులో ఆణిముత్యాల్లాంటి 27 కథలున్నాయి. మెరుగైన కథలు తయారుచేయడానికి చర్చించుకోవడం, ఉత్తమ రచనలు చేయడం అనే లక్ష్యంతో 2017 మార్చి 19న ఆవిర్భవించిన ఈ గ్రూపు అనుకున్నవిధంగానే కొత్తనైపుణ్యాలను ఒంటబట్టించుకుంది. వీళ్ళంతా పాపికొండల్లో లాంచీపై విహరిస్తూ పుస్తకాలు ఆవిష్కరిస్తూ, కథను చర్చిస్తూ విశ్లేషణలు కూడా చేశారు. ఓ ప్రముఖ వారపత్రిక నిర్వహించిన పోటీల్లో ఈ వాట్సాప్‌ సమూహంలోని ఐదుగురు నవలారచయితలు విజేతలుగా నిలిచి లక్షరూపాయలు వంతున బహుమతులు గెలుచుకోవడం మరో అద్భుతం. ఈ వాట్సాప్‌ సమూహం స్వయంగా ముద్రించుకున్న కథల పుస్తకమిది. సమకాలీన తాజా సమస్యల్ని సృజిస్తూ, మానవీయ కోణాన్ని ఆవిష్కరించే కథలు ఇందులోవన్నీ. 

 

AUTHORS & STORIES
కథల సంకలనం 2018  
సంపాదకులు ఎం.ఆర్‌.వి.సత్యనారాయణమూర్తి
ధర 150 రూపాయలు
పేజీలు 232
ప్రతులకు ఎం.రాజేశ్వరి, కార్యదర్శి, రమ్యసాహితి సమితి, జె.వి.ఎల్‌.రావు నగర్‌, పెనుగొండ. ప.గో.జిల్లా
మొబైల్‌ 9848663735 మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు