తెలంగాణ తెరకు తొలి వెలుగు బి.నరసింగరావు. కవి, రచయిత, సంగీత–చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్‌, రంగస్థల సినీనటుడు, శిల్పి....ఇలా బహుముఖ ప్రజ్ఞాశీలి. మనదేశ సినీ ఉద్యమంలో సత్యజిత్‌రే, మృణాల్‌సేన్‌, రిత్విక్‌ ఘటక్‌, శ్యాంబెనెగల్‌ వంటివారి పరంపరలో చేరిన దర్శకుడు. ఆయన జీవిత కళాచలనచిత్రయాత్రను పుస్తకరూపంలోకి తెచ్చారు ప్రముఖ సినీచరిత్రకారుడు హెచ్‌.రమేష్‌బాబు.మాభూమి, దాసి, మట్టిమనుషులు, రంగులకల, హరివిల్లు లాంటి ఆయన తీసిన చిత్రాలు డాక్యుమెంటరీలు జాతీయ జీవన స్రవంతిలో పేరెన్నికగన్నవి. ఈ తరానికి స్ఫూర్తినింపే ఆయన జీవిత పుస్తకం తప్పకచదవాల్సినది.   

 

బి.నరసింగరావు జీవిత కళా చలనచిత్ర యాత్ర
హెచ్‌.రమేష్‌బాబు
ధర లేదు
పేజీలు 56
ప్రతులకు దక్కన్‌ అకాడమీ, భూపతి సదన్‌, 3–6–716, 12వ వీధి, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌–29 ఫోన్‌ 040–27635644