బాచి పేరుతో తెలుగు పాఠకలోకానికి చిరపరితుడైన కార్టూనిస్టు, నంది అవార్డు గ్రహీత అన్నం శ్రీధర్‌. వృత్తిలో హైకోర్టు న్యాయవాదిగా, ప్రవృత్తిలో కార్టూనిస్టుగా, నటుడు, రచయితగా బహుముఖ పాత్ర నిర్వహిస్తున్నారు బాచి. ఇప్పటికే ఆయన పలు పురస్కారాలు పొందారు. నవ్య వీక్లీలో ‘తీన్‌మార్‌’ శీర్షిక నిర్వహిస్తూ పాఠకులకు ఆత్మీయుడయ్యారు. ఆయన కార్టూన్లు పలు పుస్తకాలుగా వచ్చాయి. ఈ తాజా పుస్తకంలో 196 కార్టూన్లు ఉన్నాయి. సాంఘిక జీవనంతో సంబంధమున్న సకల వేదికలనూ ఉపయోగించుకుని సునిశితమైన హాస్యం పండిస్తూ, పాఠకులను ఒక్క క్షణంలో ఫక్కున నవ్వించే కార్టూనిస్టు బాచి.

బాచి కార్టూన్లు–2

అన్నం శ్రీధర్‌ బాచి 
ధర 100 రూపాయలు
పేజీలు 104
ప్రతులకు రచయిత, ఎస్‌–3, శ్రీవెంకటేశ్వర రెసిడెన్సీ, వికాస్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌–60 
సెల్‌ 98 48 99 24 33 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు