విశ్రాంత అధ్యాపకుడు, రచయిత అమరవాది రామచంద్రమూర్తి. రిటైర్మెంట్‌ జీవితాన్ని అందంగా మలుచుకునేందుకు రచనావ్యాసంగాన్ని ఎంచుకుని తన అనుభవజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారాయన. భద్రాచలంలో పదేళ్ళున్న సమయంలో ఆయన అనుభవాలను ఇరవైనాలుగు కథలుగా మలిచి ఈ సంపుటిలో మనకు అందించారు. ఇవన్నీ ఒక వారపత్రికలో పాఠకాభిమానం చూరగొన్న కథలే. కారణజన్ముడు నడయాడిన పుణ్యభూమి విశేషాలు, కాలేజీ ముచ్చట్లు, కొలీగ్స్‌ అసూయలు, బదిలీలు...ఇలా మాస్టారి అనుభవ కథలే ఇవన్నీ. దీంతోపాటు ‘అధ్యాపకుడి ఆత్మానందం’ అనే 73 పేజీల ఆయన మినీ నవల కూడా ఇందులో జత చేశారు. ఆదర్శవంతుడైన అధ్యాపకుడు శ్రీనివాస్‌ కాలేజీ అనుభవాలు, అతడు సివిల్స్‌ పరీక్షరాసి ఆదాయపన్నుశాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ స్థాయికి ఎదిగిన కాలేజీ నవల ఇది.

 

భద్రాచలం  కథలు
మరియు అధ్యాపకుడి ఆత్మానందం నవల
అమరవాది రామచంద్రమూర్తి 
ధర 100 రూపాయలు
పేజీలు 216
ప్రతులకు  రచయిత, స్కైలా గేటెడ్‌ కమ్యూనిటీ, పుప్పాలగూడ , మణికొండ , హైదరాబాద్‌ – 89 
సెల్‌ 9440401027