ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు సుధామ. అసలు పేరు అల్లంరాజు వెంకటరావు. ఆకాశవాణి హైదరాబాద్‌ కార్యక్రమాల నిర్వహణాధికారిగా రిటైరయ్యారు. ఆయన కార్టూనిస్టు, చిత్రకారుడు, అధ్యాపకుడు కూడా. సుమారు వంద పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు. అరమరికలులేని తత్త్వం, స్పష్టమైన ఆలోచన, అంతకుతగ్గ భావప్రకటన, వివిధ సాహిత్యప్రక్రియల్లో, సామాజిక అంశాల్లో అవగాహన గల రచయిత. ప్రముఖకథానవలా రచయితల పుస్తకాలెన్నింటికో పీఠికలు రాసి అందరికీ ఆత్మీయుడయ్యారు. ఈ పుస్తకంలో ఉన్నవన్నీ సుధామగారి పీఠికలు, ముందుమాటలే. కథ, కవిత, వ్యాసం, నవల, నాటకం, కార్టూన్‌ కాలమ్‌, గళ్ళనుడికట్టు ఇలా 117 టైటిల్స్‌లో వచ్చిన గ్రంథాలకు రాసిన పీఠికలు, ముందుమాటలు చదివితే సాహిత్యాన్ని అవలోకనం చేసిన అనుభూతి కలుగుతుంది. 

 

భూమిక
సుధామ పీఠికలు–ముందు మాటలు 
సంపాదకులు అల్లంరాజు ఉషారాణి
ధర 300 రూపాయలు
పేజీలు 470
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు