సీనియర్‌ జర్నలిస్టు, రచయిత్రి సి.సుజాత. పలు నవలలు,  కథాసంపుటాలు వెలువరించడమేకాదు, అనేక పురస్కారాలందుకున్నరచయిత్రి. ఆమె రెండు తాజా పుస్తకాలలో ఒకటి ఛానల్‌ 24/7, మరొకటి  ఆంగ్ల పుస్తకం ‘ది షాడో అండ్‌ ది అదర్‌ స్టోరీస్‌’. మీడియామీద రాసిన పుస్తకం ‘ఛానల్‌ 24/7’. దీంట్లో ‘కాంచన వీణ’ అనే మరో నవలిక కూడా ఉంది. సమాచార విప్లవానికి సంబంధించిన వస్తువుతో ఆధునికంగా ఉంటాయి ఈ రెండు నవలికలు. fact – truth ఈ రెండూ ఒకటి కాదనీ, న్యూస్‌మీడియాలో ఏం జరుగుతోందో, ఈ వ్యత్యాసం ఏమిటో ఈ రెండు నవలికలలో రచయిత్రి వివరిస్తారు.

 

ఛానల్‌ 24/7
సి. సుజాత
ధర 60 రూపాయలు
పేజీలు 144
ప్రతులకు సాహితి ప్రచురణలు, చంద్రం బిల్డింగ్స్‌, చుట్టుగుంట
విజయవాడ–04 
ఫోన్‌ 0866–2436642., సెల్‌ 81 21 098 500