కవి, జర్నలిస్టు, వ్యాస రచయిత సంగెవేని రవీంద్ర. జాతీయస్థాయిలో సాహిత్య, ప్రతిభా పురస్కారాలెన్నో అందుకున్నారు. సాహితీసేవారత్న, కవిరత్న బిరుదాంకితుడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ‘కాళిదాస్‌’ బిరుదునందుకున్నారు. ఇప్పటివరకు ఆయన రాసిన ఐదు కవితా సంపుటిలు, నానీల సంపుటి, రెండు దీర్ఘ కవితా సంపుటిలు, చరిత్ర, పరిశోధన,వ్యాస సంపుటిలు వెలువడ్డాయి. ‘చౌరస్తాలో సముద్రం’ ఆయన తాజా కవితా సంపుటి. 47 కవితలున్న ఈ సంపుటిలో మనిషిచేస్తున్న తప్పిదాలు, వివక్ష, అంతరాలు, ఆత్మహనన ధోరణులను ఎండగట్టారు. 

 

చౌరస్తాలో సముద్రం
కవిత్వం
సంగెనేని రవీంద్ర
ధర 100 రూపాయలు
పేజీలు 108
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు