దాస్‌ పేరుతో తెలుగు పాఠకులకు చిరపరిచితులైన కార్టూనిస్టు జి.సి.పద్మాదాస్‌. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌లో ఇంజనీరుగా పదవీ విరమణ చేసి కార్టూన్‌ కళకు అంకితమయ్యారు. దాస్‌ కార్టూన్లు పేరిట రెండు కార్టూన్ల సంకలనాలు వెలువరించారు. ఈ తాజా పుస్తకంలో 196 కార్టూన్లు ఉన్నాయి. సమాజంలోని అవినీతి, అపార్థాలు, రైతు బాధలు, పిల్లల నిజమైన కోరికలు, స్నేహసంబంధాలు, భార్యాభర్తల బంధాలు సహా అన్నిటిమీదా వ్యంగ్యం, హాస్యం ఉట్టిపడేలా నవ్వించే కార్టూన్లు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి.

దాస్‌ కార్టూన్లు–2
జి.సి.పద్మాదాస్‌
ధర 100 రూపాయలు
పేజీలు 104

ప్రతులకు రచయిత, ఎఫ్‌–2, గాయత్రి నిలయం, కానూరు డొంకరోడ్‌, 

విజయవాడ–07 సెల్‌ 89 85 22 66 22మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు