హృదయస్పర్శ ద్వారా ఆలోచనల్ని రగిలించే కవి విల్సన్‌రావు కొమ్మవరపు. చిత్తశుద్ధి, చొరవ, సంక్లిష్టలేమి గల కవి. ఇప్పటికి మూడు కవతా సంపుటాలు వెలువరించారు. 74 కవితలున్న ‘దేవుడు తప్పిపోయాడు’ అనే ఈ తాజా కవితా సంపుటి రైతుకు, నేలకు పట్టం కట్టింది. ‘దేవుడా నువ్వెప్పుడూ నీ లోంచి నువ్వు తప్పిపోతూనే ఉండు, నన్ను నేనే ఈ నేలలో విత్తుకుని కొత్త జలానికి దోసిలిపడతా..’ అంటూ దేవుడిపై ఆగ్రహిస్తాడు కవి. 

 

దేవుడు తప్పిపోయాడు  (కవిత్వం)
విల్సన్‌రావు కొమ్మవరపు
ధర 120 రూపాయలు
పేజీలు 204
ప్రతులకు పాలపిట్టబుక్స్‌, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430, నవోదయ, హైదరాబాద్‌, అనేక ప్రగతిశీల బుక్‌సెంటర్‌, విజయవాడ, నవతెలంగాణ పుస్తక కేంద్రాలు