సమకాలీన కథనాలు

1960-70 దశకాల్లోని నాటి మధ్య తరగతి స్త్రీల, సంసారాల, బాధల, గాధల ఘటనలు ప్రధాన ఇతివృత్తమైన కథలు దౌలత్‌ బేగం కథలు.  ఆనాటి సామాజిక మనస్తత్వాన్ని నేటి తరం పాఠకులకు చక్కగా, సూటిగా పరిచయం చేస్తాయి. మధ్య తరగతి జీవితాల్లోని విషాదం అంతిమంగా ఆత్మహత్యలకూ, యాదృచ్ఛిక చావులకు ఎలా దారితీస్తుందో ఈ సంపుటిలోని చాలా కథలు ఎటువంటి కల్పనలూ, ముసుగులూ లేకుండా సహజంగా వివరిస్తాయి. పదాడంబరం లేకుండా స్త్రీల జీవితాల్లోని అన్ని కోణాలూ స్పృశిస్తాయి. సంఘటనలనూ, అనుభవాలను కథలుగా మార్చి చెప్పే క్రమంలో రచయిత్రి వేగం, ప్రజ్ఞ ఆ కాలం నాటికే కాదు నేటికీ ఆశ్చర్యపరిచేలా ఉండడం ఈ సంపుటి ప్రత్యేకత. 
- లెనిన్‌ ధనిశెట్టి
 
దౌలత్‌బేగం కథలు
పేజీలు : 165, వెల : రూ.100
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు