మనుషులు ఇప్పుడు బండబారిపోయారు. అన్నింటినీ భరించేందుకు సిద్ధమైపోతున్నారు. చేవచచ్చిపోతున్నారు. ప్రతిచోటా ఎడ్జి్‌స్టమెంట్‌, ఎడ్జ్‌స్టమెంట్‌. అన్యాయాలు, అక్రమాలు, ఆర్తనాదాలు...ఇప్పుడు చిరాకైపోతోంది చాలామందికి! చేతిలో స్మార్ట్‌ఫోన్‌, కృత్రిమ సుఖాలు... మబ్బుల్లో నీళ్ళల్లా మభ్యపెడుతున్న వైనం. యదార్థవాదీ లోకవిరోధి అన్నవైనం. కానీ సమాజం ఎంత వికృతరూపం దాల్చినా యదా ర్థాన్ని చర్చిస్తూనే ఉంది. స్వభావాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. అరటిపండు ఒలిచేవాడు, బండారం బైటపడేసేవాడు కరవైపోయాడు. అందుకే మళ్ళీ మనల్ని తట్టి లేపేందుకు అర్థశతాబ్దిచరిత్రగల దిగంబర కవిత్వంలో వెలువడిన మూడు సంపుటాలూ కలిసి ఒకే సంపుటిగా ఇప్పుడు అందుబాటులోకొచ్చింది.


-లలితా త్రిపుర సుందరి


 

దిగంబర కవులు
మూడు కవితా సంకలనాల ఏకైక సంపుటి
ధర: 200 రూపాయలు, పేజీలు: 286
ప్రతులకు: నవోదయ పబ్లిషర్స్‌, విజయవాడ, నవోదయ బుక్‌హౌస్‌, హైదరాబాద్‌, ప్రజాశక్తి బుక్‌హౌస్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌.