రచయిత్రి ముంజులూరి కృష్ణకుమారి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత సంచాలకురాలు, మూడు దశాబ్దాలుగా బాలలకోసం ఎన్నో కథలు, నవలలు రాస్తున్నారు. ఇప్పుడు వెలువడిన ఆమె మూడు తాజా పుస్తకాల్లో రెండుపిల్లల నవలలు కాగా మరొకటి పోలెండ్‌ వైద్యుని యదార్థ గాథ. ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సాయపడితే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడగలమని చెప్పే నవల ‘ఏనుగు సాహసం’. ‘పక్షులు, ఎలుకలన్నీ కలిసి మానవ కాలుష్యం నుంచి అడవిని కాపాడుకున్న మరో నవల ‘ఈ అడవి మాది’. జీవ వైవిధ్యాన్ని పాటించాలనీ, నీటిని కలుషితం చేసుకోకూడదనీ పిల్లలకు విజ్ఞానం నేర్పే నవల ఇది. మరో పుస్తకం ‘బాలల నేస్తం డాక్టర్‌ కోర్జాక్‌’. అనాథ పిల్లలకోసం జీవితాన్ని అంకితం చేసిన పోలాండ్‌ రచయిత డాక్టర్‌ కోర్జాక్‌ (హెన్రీ గోల్డ్‌స్మిత్‌). పిల్లలకోసం ఓ గొప్ప ప్రపంచం సృష్టించాడు. నరహంతకుడైన హిట్లర్‌ దురాగతాలకు బలైన వారి జీవిత కథ కంట నీరు రప్పిస్తుంది.

ఈ అడవి మాది

ముంజులూరి కృష్ణకుమారి
ధర 100 రూపాయలు
పేజీలు 24
ప్రతులకు సాహితీమిత్రులు, అరండల్‌ పేట, విజయవాడ–2
ఫోన్‌ 0866–2433359., సెల్‌ 9490634849