గతకాలపు ప్రముఖ రచయిత, సంస్కృత పండితులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (1911–1987). ఎన్నో గొప్ప పురస్కారాలందుకున్నారు. పలు సాహితీప్రక్రియలు సృజించారు. ఐదు దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో ఆయన రాసిన నాటకాలు, నాటికలను క్రోడీకరించి మొదటిసారి ఇలా పుస్తకరూపంలో వెలువరించారు. ఇందులో 17 నాటికలు, మూడు కవితలు, ఒక కథానిక ఉన్నాయి. చారిత్రక, ఐతిహాసిక, సాంఘిక ఇతివృత్తాలతో కూడిన ఇందులోని నాటికలన్నీ మనకర్థమయ్యే చక్కటిభాషలో ఉంటాయి. ‘మృచ్ఛకటికం’ చదివి రాసిన నాటకంలో మాద్రి, శ్రీరామ పాదుకలు, బలి, ఆటవెలది, రక్తనైవేద్యం, స్వప్నవాసవదత్త, భాసమహాకవి ప్రతిమ సహా 17 నాటకాలున్నాయి. మనకు తెలియని ఐతిహాసిక విషయాలెన్నో ఇందులో చదివి మనం అచ్చెరువొందటం ఖాయం.

హేమమాలి, ఇతర నాటికలు

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ధర 225 రూపాయలు
పేజీలు 232
ప్రతులకు అనల్ప బుక్‌ కంపెనీ, సికింద్రాబాద్‌ e-–mail: analpabooks@gmail.com