ప్రజాకర్తవ్యాలు విస్మరిస్తున్న కార్యనిర్వాహక వ్యవస్థ, వివాదాస్పదమై రోడ్డునపడుతున్న తాజా అనుభవాల ప్రపంచమిది. వ్యక్తిగత క్రమశిక్షణ విస్మరించిన శుష్క ప్రకటనల ప్రపంచమిది. కానీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఇటీవలే పదవీ విరమణ పొందిన డా. శ్రీనివాసులు దాసరి దీనికి భిన్నం. 

100 మంది ట్రైనీ ఐఎఎస్‌లు వెళ్ళేందుకు తిరస్కరించిన నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలనే కార్యక్షేత్రంగా ఎంచుకున్నారాయన. నాలుగుసార్లు నక్సలైట్ల కిడ్నాప్‌లకు గురైనప్పటికీ, మొక్కవోని దీక్షతో ఆయన చేసిన సేవల్ని గిరిజనులు నేటికీ కథలుగా చెప్పుకుంటారు. ‘సంవేదన’ పేరిట నవ్య వీక్లీలో 36 వారాలు ప్రచురితమైన ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ‘ఇప్పచెట్టు నీడలో...’ సంకలనంగా వెలువడింది. అధికార దర్పానికి దూరంగా కొండకోనల్లో పేదల కష్టనష్టాల్లో పాలుపంచుకుని గిరిజన, గోండు, ఆదివాసీల జీవన విలువల ఎదుగుదలకు కృషిచేసిన ఆదర్శప్రాయుడు శ్రీనివాసులు. ఒక మంచి ఐ.ఎ.ఎస్‌ అధికారి కావాలనుకునేవారికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. చట్టాన్ని ప్రజాపక్షంచేయాలనుకునే నిజమైన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇదో కరదీపిక.  

 

 

ఇప్పచెట్టు నీడలో....
ఓ ఐఏఎస్‌ అధికారి ఆదివాసీ ‘సంవేదన’
డా. శ్రీనివాసులు దాసరి
ధర 199 రూపాయలు
పేజీలు 156
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు