ఇందులో ముప్ఫై కథలున్నాయి. ఒక ఉపాధ్యాయిని తన కెరీర్‌ అరంభం నుంచి ఉద్యోగ విరమణ వరకు, అనంతరం పూర్వవిద్యార్థుల సమావేశంలో అనుభవాలను గుర్తుచేసుకోవడం వరకు ఉన్నవే ఈ ఇస్కూలు కథలు. విద్యార్థులతో తన అనుబంధం, ఆత్మీయత, బాధ్యత, సహోధ్యాయులు, సీనియర్ల ప్రవర్తనలు....ఇలా ఎన్నో అనుభవాలు కూర్చిన కతలివి. ప్రస్తుత విద్యావ్యవస్థ దిగజారిపోయిన నేపథ్యంలో కొందరివల్ల పాఠశాల వాతావరణం ఎంతగా కలుషితమైపోయిందో, మరికొందరు ఎలా అంకితభావంతో పనిచేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చిత్రించిన కథలే ఇవన్నీ. 

ఇస్కూలు కతలు
శీలా సుభద్రాదేవి
ధర 150 రూపాయలు
పేజీలు 164
ప్రతులకు రచయిత్రి, 217, నారాయణాద్రి, ఎస్‌.వి.ఆర్‌.ఎస్‌. బృందావనం, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌–35