కామేష్‌ పేరుతో తెలుగు పాఠకులకు చిరపరిచితులైన కార్టూనిస్టు పేరి సూర్య కామేశ్వరరావు. నాలుగు దశాబ్దాలుగా వేలాది కార్టూన్లు గీస్తూ తెలుగువారి స్ర్టెస్‌ రిలీఫ్‌కు దోహదపడుతున్న కామేష్‌ హైదరాబాద్‌ హైకోర్టులో అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌గా రిటైరై కార్టూను కళకే అంకితమయ్యారు. ఆయన కథా రచయిత కూడా. ఇప్పటికే ఆయన కార్టూన్లు పలు పుస్తకాలుగా వచ్చాయి. ఈ తాజా పుస్తకంలో 197 కార్టూన్లు, ‘మాక్‌డ్రిల్‌ అను దొంగాట’ కార్టూన్ల కథ మనల్ని ఎంతగానో అలరిస్తాయి. సామాన్య ప్రజల జీవితాలను కొంత ఫాంటసీతో కలగలిపి కార్టూన్లుగా చేసిన ఈ కార్టూన్లన్నీ మనకెంతో రిలీఫ్‌నిస్తాయి.

కామేష్‌ కార్టూన్లు–2

ధర 100 రూపాయలు
పేజీలు 104
ఎస్‌.ఎస్‌.పబ్లికేషన్స్‌, రాక్‌టౌన్‌ కాలనీ, ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌–68 సెల్‌ 94408 79 858 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు