మంచి కథకుడు, నాటకకర్త, వక్త, చిత్తశుద్ధి, బాధ్యత గల జర్నలిస్టు చింతకింది శ్రీనివాసరావు. పది కథలున్న ఆయన తాజా కథల పుస్తకం ‘కప్పస్తంభం’ ఉత్తరాంధ్ర మాండలికానికి దర్పణం.  ఇందులోని టైటిల్‌ కథ ‘కప్పస్తంభం’ ‘కథ’ ప్రయోజనాన్ని చాటి చెబుతుంది. సింహాచలం నృసింహస్వామి అంతరాలయంలో టన్నులకొద్దీ బరువుండే కప్పస్తంభం రాత్రికిరాత్రి మాయమైపోవడం, కొన్ని షరతుల మేరకు అది అంతరాలయంలో తిరిగి కొలువుదీరడమే ఈ కథ. దేశ సంక్షేమాన్ని ఆకాంక్షించే ఆ ‘కప్పస్తంభం’ విధించిన షరతులేమిటో, కొసమెరుపేమిటో పుస్తకం కొని చదవాల్సిందే. ఈ కథలన్నీ మనకు జీవితాన్ని చూపిస్తాయి. కొత్త తరహాగా అనిపిస్తాయి.

 

కప్పస్తంభం
చింతకింది శ్రీనివాసరావు
ధర 120 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు ప్రముఖ పుస్తక దుకాణాలు