బాపూగారి తమ్ముడు ప్రసిద్ధ కార్టూనిస్టు, ఆకాశవాణి విశ్రాంత స్టేషన్‌ డైరెక్టర్‌ సత్తిరాజు శివశంకర్‌ తాజా సంకలనం ఈ పుస్తకం. 120 మంది తెలుగు కార్టూనిస్టుల సంక్షిప్త పరిచయాలతో, పెన్సిల్‌ ఆర్ట్‌తో గీసిన వారి కేరికేచర్స్‌తో ఇది వెలువడింది. కార్టూనిస్టుల వివరాలు, ఫోన్‌–మెయిల్‌ ఐ.డి నెంబర్లతో ఆల్బమ్‌ కమ్‌–డైరెక్టరీలా దీని రూపొందించారు. ఆ కార్టూనిస్టులు గీసిన కార్టూన్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు మనదేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 27మంది ప్రముఖ కార్టూనిస్టుల పరిచయాలను కూడా వారి పెన్సిల్‌ కేరికేచర్లతో ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

 

మన కార్టూనిస్టుల రూపు రేఖలు
సత్తిరాజు శంకర నారాయణ
ధర 350 రూపాయలు
పేజీలు 416
ప్రతులకు నవోదయ, అక్షజ్ఞ పబ్లికేషన్స్‌. విద్య: 90004666461., బ్నిం: 918341450673.,
అరుణ: 91939 05 45 657