ఇది ముసుగు తొడుక్కున్న లోకం. నీతులన్నిటినీ గాలికొదిలేసిన నిస్సిగ్గులోకం...అని నిర్భయంగా తన కవిత్వంలో చాటి చెప్పారు ఈ కవసంపుటి రచయిత మొవ్వా రామకృష్ణ. ఇందులోని 100కవితలూ మనల్ని నిలబెట్టి ప్రశ్నిస్తాయి. బుజ్జగిస్తాయి, మానవత్వాన్ని తట్టిలేపుతాయి.  

‘దొంగ..దొంగా! అంటూ....గొంతెత్తి అరిచాను అర్థరాత్రి..../....పడుకోండి...మీకన్నా పెద్ద దొంగ ఎవడండీ....అంది భార్య అటుపక్కకకు తిరిగి....ఇలా సాగిపోతాయీ కవితలు. 

 

మనిషి  దొంగ... .నిజంగా!?
మొవ్వ రామకృష్ణ
ధర 100 రూపాయలు
పేజీలు 146
ప్రతులకు రచయిత, హైదరాబాద్‌–70 ఫోన్‌ 77423777., rk.movva6777@gmail.com